బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత... సీసీ కెమెరాల ఏర్పాటు.. వేలాది మంది సిబ్బంది మోహరింపు

బుధవారం, 16 సెప్టెంబరు 2015 (07:19 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున భద్రతను పెంచింది. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాయుధ బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకున్నారు. తీవ్రవాదుల ముప్పు హెచ్చరికలతో తిరుమల సెక్యూరిటీని అమాంతం పెంచేశారు. 
 
మాడ వీధులలో 29 గేట్లను... 13 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తిరుమలలో 24 గంటలూ బాంబు డిస్పోజల్ టీంలు తిరుగుతుంటాయి. అతిథి గృహాలు, మండపాలు, బహిరంగ ప్రాంతాలు, ఇలా ఒకటేంటి అన్నింటి వద్ద వీరు ఆకస్మిక తనిఖీుల చేస్తూనే ఉంటారు. లక్షలాది మంది జనం ఇక్కడకు చేరుతుండడంతో ఈ ర్యలు తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎన్డీఆర్ఎఫ్ దళం, రెండు ఆక్టోపస్ దళాలు తిరుమలలో తిష్ట వేశాయి. వీరికి తోడుగా ఒక గ్రేహౌండ్స్ దళాలు, 2600 మంది హోంగార్డులు, ఎస్పీఎఫ్ దళాలు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారు. నడక దారిలో భద్రతను కూడా పెంచారు. అడుగడునా భక్తులకు సహకరించే విధం ఏర్పాట్లు చేశారు. 

వెబ్దునియా పై చదవండి