అల్‌ఖైదా ఏజెంట్‌గా పరమాణు శాస్త్రవేత్త!

ప్రముఖ అల్‌ఖైదా తీవ్రవాద సంస్థకు పరమాణు శాస్త్రవేత్త ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడని ఫ్రాన్స్‌కు చెందిన న్యాయనిపుణుల అధికారలు బృందం తెలిపింది.

యూరోప్‌కు చెందిన పరమాణు పరిశోధనాసంస్థ (సీఆర్ఎన్)లో " బిగ్ బ్యాంగ్ " థియరీని అధ్యయనం చేసే 32 సంవత్సరాల ఇంజినీర్‌ను గూఢచార విభాగానికి చెందిన అధికారులు గతవారం అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ విభాగాధికారులు అదుపులోకి తీసుకున్న ఈ ఇంజినీర్‌కు ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖైదాతో సంబంధాలున్నట్లు తమ విచారణలో తేలిందని న్యాయనిపుణులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి