ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ సహకారంతో అమెరికా నష్టం!

ప్రముఖ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) సంస్థ సహకరిస్తోందని అమెరికా సెనేట్ సభ్యుడు జాన్ మెక్‌కెయిన్ అన్నారు. తాలిబన్ తదితర ఉగ్రవాద గ్రూపులకు ఐఎస్ఐ సహకరిస్తుండటం ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు ప్రధాన సమస్యగా మారిందన్నారు.

భయంకరమైన హక్కాని నెట్‌వర్క్, తాలిబన్ వంటి సంస్థలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సహకరిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలో కొనసాగడమనేది అమెరికాకు నష్టమేనని చెప్పారు.

ప్రస్తుతం ఉగ్రవాదుల సురక్షిత స్థావరంగా ఉన్న పాకిస్తాన్ ఇకముందూ అలాగే కొనసాగకూడదనేది మనం అర్థం చేసుకోవాలని, లేకుంటే ఉగ్రవాదంపై యుద్ధంలో మన సామర్థ్యంపై ఎంతో భారం పడుతుందని మెక్‌కెయిన్ ఎన్‌బిసికి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి