శ్రీలంక ఉత్తర వాయువ్య జిల్లాలో పునరావాసంలో ఉన్న 150 మంది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) మాజీ క్యాడర్ను విడుదల చేసే ప్రక్రియ చివరి దశలో ప్రభుత్వం ఉన్నట్లు సైనిక ఉన్నతాధికారి మంగళవారం పేర్కొన్నారు. తమిళ టైగర్ల మాజీ క్యాడర్ పెయింటింగ్స్, హస్తకళానైపుణ్యాల శిక్షణ చివరి దశలో ఉన్నట్లు రిహాబిలియేషన్ కమీషనర్ జనరల్ మేజర్ జనరల్ సుదంత రణసింఘే వెల్లడించారు.
పునరావాస కార్యక్రమం పూర్తి అయిన వెంటనే 150 మంది ఎల్టీటీఈ క్యాడర్ను శుక్రవారం విడుదల చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2009 మేలో ముగిసిన జాతుల సంఘర్షణ చివరి దశలో 11,700 మంది ఎల్టీటీఈ క్యాడర్ భద్రతా దళాల ముందు లొంగిపోయింది. వీరిలో 7,969 మంది విడుదల కాగా 2,879 మంది మాజీ క్యాడర్ పునరావాస శిబిరాల్లో ఉన్నట్లు మేజర్ జనరల్ రణసింఘే తెలిపారు.