కెనడాలో విమాన దుర్ఘటన: నలుగురి మృతి

కెనడాలోని ఓంటారియో ప్రాంతానికి చెందిన అటవీ ప్రాంతంలో తేలికపాటి విమానం క్రాష్ జరగడంతో దుర్ఘటన పాలైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా విమాన శకలాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

పైపర్ పీఏ-28 అనే పేరుగల విమానం ఆదివారం సూయూబరి నుంచి 400 కిలోమీటర్ల తూర్పు దిశలో కింగ్‌స్టన్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని ఓంటారియో ప్రాంతీయ పోలీసు అధికారి కైరోల్ డియోనీ తెలిపారు.

ఇదిలావుండగా విమానం క్రాష్ అయిన ప్రాంతంలో దట్టమైన అడవులున్నాయని, అడవుల మధ్య ఈ దుర్ఘటన జరగడంతో రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం తాము దుర్ఘటనకు సంబంధించిన అన్ని కోణాలలో విచారణ చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి