కొలంబోకు చేరుకున్న తమిళనాడు ఎంపీల బృందం

ఆదివారం, 11 అక్టోబరు 2009 (15:45 IST)
శ్రీలంక తమిళుల జీవన స్థితిగతులు, వారు నివశిస్తున్న ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందం ఒకటి ఆ దేశ రాజధాని కొలంబోకు చేరుకుంది. తమిళనాడు ప్రభుత్వం అనుమతి మేరకు ఈ బృందం అక్కడ పర్యటిస్తోంది.

డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఏకేఎస్. విజయన్, టీకేఎస్ఇళంగోవన్, హెలన్ డేవిడ్సన్, కాంగ్రెస్ తరపున సుదర్శన్ నాచియప్పన్, ఎన్.ఎస్.వి.సిద్దన్, కేఎస్.అళగిరి, జేఎం.హారూణ్, వీసీకే తరపున తోల్.తిరుమావళవన్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

కాగా, ఈ బృందానికి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న ఎంపీల బృందం శ్రీలంక తూర్పు ప్రాంతాల్లో పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. ఐదు రోజుల పాటు శ్రీలంక తమిళుల నివాసిత ప్రాంతాల్లో పర్యటించే ఈ బృందం ఈనెల 14వ తేదీన చెన్నయ్‌కు చేరుకుని ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి ఒక నివేదికను సమర్పిస్తుంది.

వెబ్దునియా పై చదవండి