చైనాకు నేను అనుకూలం కాదు: నేపాల్ నేత ప్రచండ

చైనాకు తాను అనుకూలమనే ప్రచారాన్ని నేపాల్ మావోయిస్ట్ అధినేత ప్రపంచ ఖండించారు. తమ దేశానికి పొరుగున ఉండే ఏ ఇతర శక్తివంతమైన దేశానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

"నేను చైనాకు అనుకూలం కాదు. లుంబిని అభివృద్ధికి సంబంధించిన ఆసియా పసిఫిక్ ఎక్షేంజ్, కోఆపరేషన్ ఫౌండేషన్‌ సమావేశానికి హాజరుకానుండడంతో చైనాకు అనుకూలమనే ముద్ర తనపై వేశారు" అని గత రాత్రి మలేషియాకు వెళ్లేముందు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రచండ తెలిపారు. మలేషియాలో నేడు జరుగనున్న ఆసియా పసిఫిక్ ఎక్షేంజ్, కోఆపరేషన్ ఫౌండేషన్‌ సమావేశంలో ఈ నేపాల్ మావోయిస్ట్ అధినేత పాల్గొంటారు.

భారత్ కూడా నేపాల్‌లో అనేక ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. తాను ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో తూర్పు-పశ్చిమ రైల్వే లైన్‌‌ను నిర్మించాలని ప్రతిపాదించాను. దీన్ని ఆధారంగా తాను భారత్‌కు అనుకూలమనే వాదన తప్పని ఆయన పేర్కొన్నారు.

భారత్‌కు పొరుగున వున్న నేపాల్‌లో ప్రచండ నేతృత్వంలోని మావోయిస్ట్ పార్టీ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. రాజు జ్ఞానేంద్ర తన అధికారాలతో పాటు ఆస్తులను కూడా కోల్పోవలసి వచ్చింది. వామపక్ష భావాలు కలిగిన ప్రచండ భారత్‌కు వ్యతిరేకమని మొదటి నుంచి ప్రచారంలో ఉంది.

వెబ్దునియా పై చదవండి