చైనాకు మొఫియా ముప్పు: 22 వేల మంది తరలింపు!

ఆదివారం, 7 ఆగస్టు 2011 (12:20 IST)
వాయువ్య చైనాక మొఫియా తుఫాను ముప్పు పొంచివుంది. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఇది పెను ముప్పుగా మారే ప్రమాదముందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 23 వేల మంది తీరవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వాయువ్య చైనాలోని షాంఘాయ్ సముద్రంలో 630 కిలోమీటర్ల దూరంలో మొఫియా వాయుగుండం ఏర్పడివున్నట్టు, ఈ కారణంగా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, సముద్రపు అలలు 11 మీటర్ల ఎత్తులేస్తాయని తెలిపింది.

ఈ తుఫాను ప్రభావం కారణంగా సముద్రతీర ప్రాంతాలైన జింగ్జీగాంగ్, బీజింగ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి