చైనా: కొండచరియలు విరిగిపడి 78 మంది మృతి

నైరుతీ చైనాలోని ఓ లోయలో కొండచరియలు విరిగిపడటంతో 78 మంది పౌరులు దుర్మరణం చెందారు. లోయలోని ఇనుప ఖనిజం గని, అనేక ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయని అధికారిక యంత్రాంగం తెలిపింది. వులోంగ్ కౌంటీలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.

ఇనుప ఖనిజం, సహజవాయువు, ఇతర ఖనిజ నిక్షేపాలు సంవృద్ధిగా కలిగివున్న ఈ ప్రాంతంలో తరుచుగా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సుమారు 500 మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇప్పటివరకు 78 మంది మృతదేహాలను గుర్తించారు. ఏడుగురు పౌరులు ప్రాణాలతో శిథిలాల నుంచి బయటపడ్డారు.

వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో పౌరులతో పాటు గని కార్మికులు కూడా ఉన్నారు. బాధిత ప్రాంతంలో అన్నిరకాల సహాయ చర్యలు చేపట్టాలని అధికారిక యంత్రాంగాన్ని చైనా అధ్యక్షుడు హుం జింటావో ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి