ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా దేశానికి చెందిన ఎలినార్ ఓస్ట్రోం, ఆలివర్ విలియంసన్ ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేతలుగా నిలిచారు. 1969 నుంచీ ప్రారంభించిన ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇంతవరకూ మహిళలను వరించలేదు.
అమెరికాకు చెందిన ఆర్థికనిపుణురాలు ఎలినార్ ఓస్ట్రోంకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. మహిళలకు నోబెల్ బహుమతి దక్కడం ఇదే ప్రథమం. ఆ ఘనత సాధించిన తొలి మహిళ ఓస్ట్రోం కావడం గమనార్హం.
ఇదిలావుండగా ఇకనామిక్ గవర్నెన్స్‌కి ఆమె చేసిన విశ్లేషణే ఈ ఎంపికకు కారణమని నోబెల్ అవార్డు జ్యూరీ పేర్కొంది.
కాగా ప్రస్తుతం ఎలినార్ ఓస్ట్రోం ఇండియానా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతి విషయం తెలియగానే శంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని ఆమె తన సంతోషం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా తన తోటి అధ్యాపక బృందం ఆమెకు శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి తమ తోటి అధ్యాపకురాలికి రావడం తమ విశ్వవిద్యాలయానికే గర్వకారణమని ఆమెతోటి అధ్యాపకులు పేర్కొన్నారు.
అందునా ముఖ్యంగా మహిళకు రావడమనేది యావత్ మహిళా లోకాన్ని గౌరవించినట్లైందని వారు హర్షం వ్యక్తం చేశారు.