థాయ్‌లాండ్‌ దేశంలో అండర్ వరల్డ్ సంతోష్ శెట్టి అరెస్టు

ముంబై అండర్ వరల్డ్ దాదా సంతోష్ శెట్టిని అంతర్జాతీయ పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. నకీలీ పాస్‌పోర్టు ద్వారా థాయ్‌లాండ్‌లో గత కొన్ని నెలలుగా నివశిస్తూ వస్తున్నట్టు ఆయన వద్ద జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది.

సంతోష్ శెట్టిపై ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో 12 హత్య కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో అండర్ వరల్డ్‌‍‌ను అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు అంతర్జాతీయ పోలీసు సాయాన్ని కోరారు. దీంతో సంతోష్ శెట్టి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు.

సంతోష్ శెట్టిపై అక్రమ మాదకద్రవ్యాల తరలింపు కేసులతో పాటు.. అనేక కిడ్నాప్, హత్య, హత్యాయత్న, అత్యాచార కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనను స్థానిక కోర్టులో హాజరు పరిచగా, ఈనెల 17వ తేదీ వరకు పోలీసు కష్టడీకి అనుమతించారు.

వెబ్దునియా పై చదవండి