నవంబర్ లోపు స్వైన్‌ఫ్లూకు మందు

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న మహమ్మారి వ్యాధి స్వైన్‌ఫ్లూను అరికట్టేందుకు నవంబర్‌‍లోపు మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

స్వైన్‌‌ఫ్లూ మహమ్మారి వ్యాధిని అంతమొందించేందుకు నవంబర్‌లోపు మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. తాము రూపొందించనున్న ఈ మందు పేద దేశాలకు చేరవేస్తామని, ఇది అక్కడి వారికి టీకాలుగా ఉపయోగిస్తామని టీకాల రూపంలో తయారు చేసే ప్రముఖుడు మేరీ పౌలేకీనీ తెలిపారు.

ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లోనున్న డాక్టర్లు, నర్సుల ద్వారా రానున్న నాలుగు నెలల్లో అందరికి టీకాలను చేరవేస్తామని, దీంతో ప్రంపంచంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధి పరుగులిడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి