అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నోబెల్ శాంతి పురస్కారానికి అనర్హుడని వెనెజులా అధ్యక్షుడు హాగో శోవేజ్ అన్నారు.
ఒబామా నోబెల్ పురస్కారానికి అనర్హుడని, ఈ పురస్కారానికి అతనిని ఎంపిక చేసినట్లు తాను చదివానని, అప్పుడే తనకు ఇతను అనర్హుడని అనిపించిందని ఆయన తెలిపారు.
ఒబామా ఏమి చేసాడని ఆయనకు నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేశారని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినవారు ఆయన ఒబామా ఆఫ్గనిస్థాన్, ఇరాక్ దేశాల్లో అమెరికా సైన్యాన్ని తరలించి అక్కడే ఉంచడం మరచిపోయినట్లున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఉపయోగపడని పనులు చేసిన వ్యక్తికి తొలిసారిగా ఇలాంటి అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన పురస్కారానికి ఎంపిక చేయడం ప్రపంచంలోని ప్రజలు తొలిసారిగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏవిధంగానైతే ఓ బేస్‌బాల్ క్రీడాకారుడు తాను 50 మ్యాచ్‌లలో గెలుపొందుతానని ప్రకటించడంతోనే అతనికి బహుమతిని ఇచ్చేస్తారో అలాగే ఒబామాకు పురస్కారానికి ఎంపిక చేసినట్లుందని ఆయన ఎద్దేవా చేసారు.