పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

పసిఫిక్ మహాసముద్రంలోని సాలుమన్ దీవులలో గురువారం తెల్లవారుఝామున పావుగంట వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపం సంభవించింది.

భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో పాటు ఫిలిప్సీన్, వనౌతీ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 నమోదైంది.

దీంతో దక్షిణ పసిఫిక్ తీరంలోని 11 దేశాలకు సునామీ ముప్పు ఉన్నట్లు అమెరికా పసిఫిక్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి