పాక్‌కు ఇచ్చే సైనిక సాయంలో కోత కొనసాగుతుంది: యూఎస్
పాకిస్థాన్‌కు అందించే మిలిటరీ సాయంలో విధించిన 800 మిలియన్ డాలర్ల మేర కోతను ఎత్తివేసేదిలేదని స్పష్టం చేసిన అమెరికా తీవ్రవాదంపై పోరాటానికి ఇస్లామాబాద్ అవసరమైన చర్యలు చేపట్టాలని పునరుద్ఘాటించింది.
"మా పౌర సాయం కొనసాగుతుంది అయితే భద్రత పరంగా లేదా మిలటరీ పరంగా సహకారాన్ని బట్టి మేము అందించే సాయం ఉంటుంది" అని అమెరికా అంతర్గత శాఖ ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్ పాత్రికేయులకు తెలిపారు. కాగా పాకిస్థాన్‌తో సంబంధాలు కొనసాగించడం అంత సులభం కానప్పటికీ అవి అత్యంత ముఖ్యమని న్యూలాండ్ చెప్పారు.
తమ దేశంలో ఉన్న అమెరికా మిలిటరీ ట్రైనర్లను తగ్గించాలని పాకిస్థాన్ కోరడంతో అమెరికా ఆ దేశానికి ఇచ్చే 800 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని నిలపివేసింది.