అగ్రరాజ్యమైన అమెరికా భారత్‌తో చేసుకున్న అణు ఒప్పందం తరహాలోనే పాకిస్తాన్‌తో కూడా అణు ఒప్పందానికి అమెరికా దేశం ముందుకు రావాలని పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ పేర్కొన్నారు.
ప్రాంతీయ అసమానతలు లేకుండా భారత్‌తో పాటే పాకిస్తాన్‌కు అణుశక్తిని సరఫరా చేసేందుకు అమెరికా సహకరించాలని గిలానీ కోరారు. అయితే ఫ్రాన్స్‌తో అణు ఒప్పందం కోసం పాకిస్తాన్ చర్చలు జరుపుతున్నట్లు గిలానీ వెల్లడించారు.
జమాత్-ఉద-దవా అధ్యోక్షుడు సరూద్ను విడిచిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఉగ్రవాదంపై పాక్ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తోందని, ఇది ద్వైపాక్షిక చర్చలకు విఘాతం కలిగిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ వ్యాఖ్యానించారు.
దీనిపై గిలానీ స్పందిస్తూ భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని సయిద్‌కు ముంబై దాడుల్లో ప్రమేయమున్నట్టుగా ఆధారాలేం దొరకలేదని అందుకే ఆయనను తమ ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు.