పాక్‌లో ఆత్మాహుతి దాడి: 28 మంది మృతి

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలోనున్న మలకంద్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరగింది. ఇందులో దాదాపు 28 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనారు.

పాక్ వాయువ్య ప్రాంతంలోని మలకంద్‌లో సోమవారం పాక్ రక్షణశాఖకు చెందిన వాహనం వద్ద ఓ వ్యక్తి ఆత్మాహుతి దళాలకు చెందిన ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆ వ్యక్తి దాడులకు పాల్పడ్డ ప్రాంతం షాంగ్లా జిల్లాలోని అల్పురాయ్‌లోని మార్కెట్‌కు సమీపంలోనున్న పోలీసు స్టేషన్ వద్ద ఈ దాడి జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఈ దాడిలో దాదాపు 28 మంది మృతి చెందారని, 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత ఏడాది మే నెలలో పాక్ వాయువ్య ప్రాంతమైన స్వాత్ లోయతోపాటు మలకంద్ డివిజన్‌లో తాలిబన్ ఉగ్రవాదులపై పాక్ ఆర్మీ మేజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మిలిటెంట్లు దాదాపు రెండు వేల మంది మృత్యువాత పడ్డారు.

గత వారం ఇస్లామాబాద్‌లోని ఐరాస ఆహార ఏజెన్సీ కార్యాలయం వద్ద కారుబాంబు దాడులు జరిగాయి. ఆ దాడుల్లో 50 మందికి పైగా మృతి చెందారు. ఇప్పుడు ఈ వారం తొలి రోజే ఇక్కడ ఆత్మాహుతి దాడి జరగడం శోచనీయమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలావుండగా గత వారం తాము నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిదిమంది సైనికులు, తొమ్మిదిమంది ఉగ్రవాదులు మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి