పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో విమానం ద్వారా బాంబులు కురిపించడంతో అక్కడికక్కడే దాదాపు 11 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.
ఉగ్రవాదుల అణచివేత కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ సైన్యం తాలిబన్ స్థావరాలపై నిర్వహించిన వైమానిక దాడులు శనివారం నుంచి ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా పాక్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించడంతో 11 మంది తీవ్రవాదులు మృతి చెందారని, వీరితోపాటు ఇద్దరు సైనికులు కూడా మృతి చెందగా మరో ఐదుగురు సైనికులు తీవ్రగాయాలపాలైనట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దక్షిణ వజీరిస్థాన్‌లో తమ భద్రతా దళాలు ఐదువేలమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.