పాక్ జవాబుదారిగా వ్యవహరించాలి: బర్మైన్

అమెరికానుంచి పొందే ఆర్థిక సహాయానికి పాకిస్థాన్ జవాబుదారీతనంగా వ్యవహరించాలని అమెరికాకు చెందిన ప్రముఖ డెమొక్రటిక్ పార్లమెంట్ సభ్యుడు కోరారు. పాక్‌కు అమెరికా చేసే ఆర్థిక సహాయం వృధా కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా ప్రతినిధి సభలో జరిగిన అత్యంత ఉన్నతమైన సమితి అధ్యక్షుని నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో విదేశీ నీతిపై సమితి అధ్యక్షుడు హోవర్డ్ బర్మైన్ మాట్లాడుతూ... పాకిస్థాన్ దేశం తమ దేశానికి జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉంటుందని, అందునా ప్రస్తుత సమాజానికి ఆ దేశం ఓ సవాలుగా మారిందని ఆయన సభలో అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పాకిస్థాన్ దేశానికి అమెరికా చేసే ఆర్థిక సహాయంలో మూడింతలు పెంచి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దీంతోబాటు కొన్ని కఠినమైన షరతులుకూడా విధించినట్లు బర్మైన్ సభకు వివరించారు.

ఇదిలావుండగా బర్మైన్ రూపొందించిన షరతులకు ఒబామా ప్రభుత్వం అంగీకరించలేదు. కాగా పాకిస్థాన్ ప్రభుత్వంకూడా ఈ షరతులకు అంగీకారం తెలుపడంలేదనేది సమాచారం.

వెబ్దునియా పై చదవండి