ప్రధాని మన్మోహన్ పర్యటన ఏర్పాట్లలో వైట్‌హౌస్

సోమవారం, 12 అక్టోబరు 2009 (09:06 IST)
భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టనున్న అమెరికా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను వైట్‌హౌస్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు నవంబరు 24వ తేదీన ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారు. 21వ శతాబ్దిలో భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్న అమెరికా.. ఆ దిశగా అన్ని రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసే పనిలో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ఎం.కృష్ణతో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని చెప్పారు. భారత్‌తో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై మరింతగా ముందుకు వెళ్లాలనే కృతనిశ్చయంతో అమెరికా ఉందని స్పష్టం చేశారు.

అయితే ఎన్‌పిటిపై అన్ని దేశాలూ సంతకాలు చేయాలని భద్రతా మండలి చేసిన తీర్మానంపై వీరి సమావేశంలో చర్చకు రాలేదు. వీరి సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రాబర్ట్‌ బ్లేక్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒబామా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక పర్యటిస్తున్న తొలి విదేశీ ప్రధాని మన్మోహనే అవుతారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి