భారత్, నేపాల్ సరిహద్దు మ్యాప్‌పై కసరత్తు

భారత్- నేపాల్ సరిహద్దుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాలు ఓ ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశాయి. ఇరుదేశాల సరిహద్దు మ్యాప్‌ను తయారు చేయడంపై ఈ కమిటీ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. దీనిని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నేపాల్‌లో భారత దౌత్యాధికారి రాకేశ్ సూద్ విలేకరులతో చెప్పారు.

భారత్- నేపాల్ సరిహద్దు వెంబడి భారత్ చొరబాట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూద్ మాట్లాడుతూ.. ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీ సరిహద్దు మ్యాప్‌ను తయారు చేయడంపై తుది దశ కసరత్తు జరుపుతోందని వెల్లడించారు. సరిహద్దు మ్యాప్‌పై సంతకం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతి కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. ఈ మ్యాప్‌పై ఇరుదేశాల ప్రభుత్వాలు సంతకం చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి