లండన్‌లో సద్దుమణుగుతున్న ఘర్షణలు: భద్రత పెంపు!

ఆదివారం, 14 ఆగస్టు 2011 (12:01 IST)
లాకప్ డెత్‌ను నిరశిస్తూ లండన్‌లో చెలరేగిన ఘర్షణలు ఇపుడిపుడే సద్దుమణుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బ్రిటన్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన ఈ ఘర్షణలను అణిచి వేసేందుకు లండన్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంది.

పైపెచ్చు.. బ్రిటన్‌లో అల్లర్లు మొదలైన తర్వాత వచ్చిన మొదటి వీకెండ్ డేస్ కావడంతో... లండన్ శివార్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీకెండ్‌కొచ్చే నగరవాసులకు 16 వేల మంది ప్రత్యేక పోలీసులతో భద్రతను పెంచారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను రెట్టింపు చేశారు. లూటీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పోలీసులను ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి