లండన్ అల్లర్లు: సత్వర చర్యలకు ప్రధాని కామెరూన్ పిలుపు

మూడురోజులుగా లండన్ అల్లర్లతో అట్టుడికిపోతుండటంతో బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ పార్లమెంట్‌ అత్యవసర సమావేశాలకు పిలుపునిచ్చారు.

లండన్, ఇతర బ్రిటన్ నగర వీధుల్లో అగ్నికి ఆహుతి అయిన భవంతులు, ధ్వంసమైన కిటీకీలు క్షీణించిన పరిస్థితికి నిదర్శమని కామెరూన్ పేర్కొన్నారు. అయితే తీవ్రమైన అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులకు మిలిటరీ సహాయం అవసరం లేదని చెప్పారు.

పోలీసులకు అన్ని సెలవులు రద్దు చేసిన కామెరూన్ దేశంలో ఉన్న బలగాలన్నింటిని లండన్‌కు రావాలని ఆదేశించారు. లూటీలకు పాల్పడ్డ 450 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 1980ల్లో సంభవించిన హింస తర్వాత పెద్ద ఎత్తున లండన్ వ్యాప్తంగా చోటుచేసుకున్న హింసలో భారీగా విధ్యంసం, లూటీలు జరిగాయి.

వెబ్దునియా పై చదవండి