లిబియా: నాటో దాడుల్లో గడాఫీ కుమారుడు మృతి

లిబియా పశ్చిమ ప్రాంతంలోని జ్లిటాన్‌ పట్టణంలో శుక్రవారం నాటో బలగాలు జరిపిన వైమానిక దాడిలో ఆ దేశ నియంత ముయమ్మార్ గడాఫీ చిన్న కుమారుడు మరణించినట్లు లిబియా తిరుబాటుదారుల ప్రతినిధి వెల్లడించారు.

జ్లిటాన్‌లో ప్రభుత్వ కార్యాలయంపై నాటో శుక్రవారం జరిపిన దాడిలో మరణించిన ప్రభుత్వ సైన్యానికి చెందిన 33 మందిలో గడాఫీ కుమారుడు 32 ఏళ్ల ఖామిస్ గడాఫీ కూడా ఉన్నట్లు లిబియా రెబెల్స్ ప్రతినిధి మొహమ్మద్ అల్ రజాలీ పేర్కొన్నారు.

అయితే ఈ విషయంపై మాట్లాడటానికి లిబియా రాజధాని ట్రిపోలిలో అధికారులు అందుబాటులో లేరు. గురువారం నుంచి బాంబు దాడులు జరుగుతున్నప్పటికీ ఖామిస్ మరణంపై ఎలాంటి నివేదిక రాలేదని బ్రెసెల్స్‌లోని నాటో ప్రతినిధి తెలిపారు.

తన తండ్రి సైన్యంలో కీలక కమాండర్ అయిన ఖామిస్ మరణం రెబెల్స్‌తో పోరాడుతున్న ప్రభుత్వ బలగాలకు తీవ్ర ఎదురు పెద్ద. ట్రిపోలీకి ఆగ్నేయంగా 90 మైళ్ల దూరంలో ఉన్న జ్లిటాన్‌లో రెబెల్స్‌తో పోరాడుతున్న 32వ బ్రిగేడ్‌కు 27 ఏళ్ల ఖామిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌ మాసంలో నాటో బలగాలు ట్రిపోలిలోని గడాఫీ నివాసంపై జరిపిన దాడిలో ఆయన కుమారుడు సైఫ్ అల్ అరబ్‌తోపాటు గడాఫీ ముగ్గురు మనవళ్లు కూడా చనిపోయారు.

వెబ్దునియా పై చదవండి