శ్రీలంక దర్యాప్తులో అంతర్జాతీయ పాత్రకు యూఎస్ మద్దతు

శ్రీలంక పౌర యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలపై చేపట్టే దర్యాప్తులో అంతర్జాతీయ మెకానిజం సహాయానికి అమెరికా మద్దతు తెలిపింది. శ్రీలంక మిలిటరీ, తమిళ టైగర్ల మధ్య సుమారు 25 సంవత్సరాల పాటు సాగి 2009లో ముగిసిన సంఘర్షణ చివరి నెలల్లో వేలాది మంది పౌరులు మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉల్లంఘనకు పాల్పడ్డ ఇరు పక్షాలు యుద్ధ నేరస్తులని ఐక్యరాజ్యసమితి నిపుణుల ప్యానెల్ తేల్చింది.

మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై శ్రీలంక కొన్ని నివేదికలు తయారు చేసింది. ప్రతిఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిష్పక్షపాతమైన దర్యాప్తుకు అంతర్జాతీయ సమాజ సహాయాన్ని తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. కాగా మా సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ఆలోచనను తిరస్కరిస్తున్నట్లు శ్రీలంక రక్షణ కార్యదర్శి గొటబయ రాజపక్స మంగళవారం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి