సయీద్‌కి తీవ్రవాద వ్యతిరేకచట్టం వర్తించదు: పాక్

నిరుడు ముంబైలో జరిగిన దాడుల వెనుక కీలక వ్యక్తిగా భావిస్తున్న హఫీజ్‌ సయీద్‌పై తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద దాఖలైన ఎఫ్ఐఆర్‌లను పాక్‌లోని లాహోర్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. జమాత్-ఉద్- దవా నాయకుడు సయీద్ విషయంలో తీవ్రవాద వ్యతిరేక చట్టం వర్తించదని కోర్టు పేర్కొనడం గమనార్హం.

గత నెలలో ఫైసలాబాద్‌లో జరిగిన రెండు బహిరంగ సమావేశాల్లో జిహాద్ గురించి ప్రస్తావించాడని అతనిపై తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిని కూడా లాహోర్ కోర్టు కొట్టివేసింది. 170 మంది ప్రాణాలు తీసిన ముంబై దాడుల వెనుక హఫీజ్ సయీద్ ప్రధాన నిందితుడని భారత్ భావిస్తోన్న విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి