సిరియా అధ్యక్షుడిపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి
హింసతో అట్టుడిగిపోతున్న సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిపోతున్నది. అసద్ గద్దె దిగాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై ప్రభుత్వ బలగాలు కాల్పులు జరిపి అణిచివేయడంపై పొరుగు దేశం టర్కీ విదేశాంగ మంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
సిరియా రాజధాని డెమస్కన్ నుంచి గల్ఫ్ దేశాలు కువైట్, బహ్రయిన్‌లు రాయబారులను వెనక్కితీసుకున్న ఒక రోజు తర్వాత టర్కీ విదేశాంగ మంత్రి పర్యటన సాగింది. గల్ఫ్ కౌన్సిల్‌లో ఉన్న ఆరు దేశాల్లో మూడు దేశాలు రాయబారులను వెనక్కుతీసుకోవడంతో సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్ సోమవారం నూతన రక్షణ శాఖ మంత్రిని నియమించారు.
ప్రజాస్వామ్యం కోసం సిరియాలో జరుగుతున్న ఆందోళనల్లో సుమారు 2,059 ప్రజలు మరణించగా 400 మంది భద్రతా బలగాలకు చెందిన వారు చనిపోయినట్లు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ పేర్కొంది. మూడు రోజుల క్రితం దేశవ్యాప్తంగా అధ్యక్షుడు అసద్ అనుకూల బలగాలు జరిపిన కాల్పుల్లో సుమారు వందమంది ఆందోళనకారులు చనిపోవడంతో అనేక దేశాలు సిరియా నుంచి తమ రాయబారులను వెనక్కుపిలిశాయి.