సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన హసీనా

అమెరికా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి స్థాయిలో త్వరగా కోలుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆకాంక్షించారు. " బంగ్లాదేశ్ ప్రజలు, ప్రభుత్వం, నేను మరియు నా కుటుంబం తరపున మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా ప్రార్ధనలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి" అని హసీనా సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు.

మీరు జరిపిన పర్యటనతో మంచి మిత్రులైన బంగ్లాదేశ్, భారత్‌లు మరింత దగ్గరయినట్లు సోనియా గాంధీ ఇటీవలి బంగ్లాదేశ్ పర్యటనను ప్రస్తావిస్తూ హసీనా చెప్పారు. దివంగత మాజీ ప్రధాని ఇందిర గాంధీకి బంగ్లాదేశ్ ప్రకటించిన తమ అత్యున్నత పురస్కారం ' బంగ్లాదేశ్ స్వాధీనతా సన్మానోనా'ను అందుకోవడానికి గానూ ఆమె కోడలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాకాకు వెళ్లారు.

వెబ్దునియా పై చదవండి