సోమాలియాలో ప్రభుత్వ సమర్థకులకు ఇస్లామ్ విద్రోహులకు మధ్య జరిగిన హింసాత్మక దాడులలో దాదాపు 64మంది మృతి చెందారు.
ఈ హింసాత్మక సంఘటనలు వాహబో గ్రామంలో జరిగింది. శెబాబ్తో కలిసి అతని సమర్థకులు అల్ ఇస్లామియా గుట్ సమాజానికి చెందిన నాయకులు ప్రభుత్వ సమర్థకులైన అహలు సున్నా వల్ జామా గ్రూపుపై ఆక్రమణ చేసేందుకు ప్రయత్నించారు.
సోమాలియా రాజధాని మోగాదిశునుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఉత్తర భాగంలో జరిగిన ఈ సంఘటనలో తొలుత 36 మంది మృతి చెందినట్లు చుట్టుప్రక్కల గ్రామస్థులు తెలిపారు. తాజా సంఘటనల కారణంగా దాదాపు 64మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.