ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ ధరించిన కోటు వేలం పాటలో అక్షరాలా 77 వేల అమెరికా డాలర్లు పలికింది. ఇది భారత దేశ కరెన్సీలో 33,88,000 వేల రూపాయలకు సమానం.
ప్రముఖ హాలీవుడ్ సెలెబ్రిటీలు ధరించిన, వినియోగించిన వస్తువులను హాంకాంగ్‌లో తాజాగా వేలం వేశారు. ఇందులో బ్రూస్ లీ గేమ్ ఆఫ్ టెక్ అనే చిత్రంలో వాడిన కోటుతో పాటు ఇతర వస్తువులను వేలం వేశారు.
ఇందులో కోటు 77 వేల అమెరికా డాలర్లకు అమ్ముడు పోయినట్టు వేలం పాట నిర్వహకులు వెల్లడించారు. ఇదేవిధంగా మరికొంతమంది సెలబ్రిటీల వస్తువులు కూడా వేలం వేసినట్టు వారు తెలిపారు.