చైనాకు చిర్రెత్తుకొచ్చింది.. లేడీ గాగా ఆల్బమ్స్‌పై నిషేధం.. దలైలామా తోడేలంటూ ఫైర్!

బుధవారం, 29 జూన్ 2016 (15:22 IST)
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై చైనా ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంది. దలైలామాతో ఎవ్వరు కలిసినా వారిపై కూడా చైనాకు కోపం వస్తుంది. అంతేకాకుండా దలైలామాను కలిసిన వారిని నిషేధిత జాబితాలో చేర్చడం చైనాకు పరిపాటి. తాజాగా ఆ జాబితాలో పాపులర్ పాప్ గాయని లేడీ గాగా కూడా చేరిపోయింది. ''లేడీ గాగా" ఆల్బమ్స్‌ అన్నింటినీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిషేధించింది. ఇందుకు గాగా దలైలామాతో భేటీ కావడమే కారణం. 
 
ఇండియానాపొలిస్‌లో జూన్‌ 26న దలైలామాతో లేడీ గాగా సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా మానసిక ధృఢత్వం, ఆధ్యాత్మికత, ధ్యానం, ప్రపంచంలో అవినీతిని ఎదుర్కోవడం వంటి విషయాల గురించి గాగా దలైలామాతో 19 నిమిషాలపాటు చర్చించారు. 
 
లేడీ గాగా ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో చైనాకు చిర్రెత్తుకొచ్చింది. అంతేకాదు.. చైనా ప్రజలు కూడా దలైలామా-గాగాల భేటీపై మండిపడుతున్నారు. అంతటితో ఆపకుండా దలైలామాను సన్యాసి వేషంలో ఉన్న తోడేలుగా అభివర్ణిస్తే, గాగా ఆల్బమ్స్‌పై కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం విధించింది.

వెబ్దునియా పై చదవండి