ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి రాడార్ సిగ్నల్స్‌కు ఆ విమానం ఆచూకీ చిక్కలేదు. సుమారు 37 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్‌బస్ ఏ320 రాడార్ నుంచి మిస్సైనట్లు అధికారులు తెలిపారు. ఈజిప్ట్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన 10 నిమిషాలకు ఆ ఫ్లయిట్ ఆచూకీ లేకుండాపోయింది. కనిపించకుండాపోయిన విమానం కోసం గాలింపు చేపట్టాలని ఈజిప్ట్ ఎయిర్ సంస్థ ఆదేశించింది.