వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని జింజి పర్వతాల అందాలను చూడ్డానికి ఒక ప్రేమ జంట అక్కడికి వచ్చింది. అక్కడ వీచిన బలమైన గాలులకు ప్రియురాలి టోపీ ఎగిరి కొండ అంచులో పడిపోయింది. ఆ టోపీ పోయిందని ప్రియురాలు ఎక్కడ బాధపడుతుందేమోనని ప్రాణాలకు తెగించి మరీ టోపీని తీసుకొచ్చాడు ప్రియుడు. పట్టు తప్పితే అతడు 1640 అడుగుల లోతులోని లోయలో పడిపోయే అవకాశం ఉన్నా ఆమె మీద ఉన్న ప్రేమతో టోపీని తీసుకొని కొండెక్కాడు.
ఈ ప్రేమికుడు చేసిన సాహసం అక్కడివారిని అబ్బురపరిచింది. కొండపైకి వస్తున్న అతన్ని అక్కడి వారు చప్పట్లతో అభినందించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆ పర్యాటక ప్రదేశంలోని అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని, చర్యలు తీసుకుంటామంటున్నారు. అంత కష్టపడి క్యాప్ తీసుకొచ్చిన ఆ కుర్రాడి శ్రమ ఊరికే పోకుండా ప్రియురాలు అతడిని అమాంతంగా గుండెలకు హత్తుకుంది.