ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కాశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని, పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కాశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు.
పాకిస్థాన్‌కు ప్రపంచం యావత్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కాశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కాశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు.