అండర్ వరల్డ్ డాన్‌ దావూద్‌పై దాడి

భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ముంబై దాడులపై నిందారోపణలు ఎదుర్కొంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం‌పై శుక్రవారం కరాచీలో దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో దావూద్ సోదరుడు అనీస్ మృతి చెందగా దావూద్‌ గాయాల పాలైనాడు.

కరాచీలోని అల్ హబీబ్ బ్యాంక్ ఏటీఎమ్ వద్ద భట్టీ గ్యాంగ్‌కు చెందిన వారు అనీస్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనీస్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అతనిపై 12 రౌండ్ల కాల్పులు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఇదిలావుండగా భట్టీ గ్యాంగ్ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తోంది. గ్యాంగ్‌వార్‌ సందర్భంగా ఈ దాడులు జరిగినాయి. కాగా ఈ భట్టీ గ్యాంగ్‌కు ఛోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి