అణు చర్చల పునఃప్రారంభంపై చైనా-ఉ.కొరియా చర్చలు!!

శనివారం, 6 ఆగస్టు 2011 (09:20 IST)
అణు నిరాయుధీకరణ చర్చలను తిరిగి ప్రారంభించే అంశంపై ఉత్తర కొరియా, చైనా దేశాలు ఉన్నత స్థాయి చర్చలు శుక్రవారం జరిగినట్టు బీజింగ్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, నిరాయుధీకరణ కోసం పూర్తి స్థాయి చర్చలు ఎప్పుడు పునఃప్రారంభమయ్యేదీ చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన వెల్లడించలేదు.

2009లో బహిష్కరించిన అనంతరం ఆ చర్చలకు తిరిగి రావాలని ఉత్తర కొరియా నుంచి సంకేతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ చర్చల్లో ఆ దేశాలు పాల్గొంటాయి. ఈ ఆరు పక్షాల చర్చలు ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, అణు నిరాయుధీకరణ విషయంపై ఆరు దేశాలతో చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు ఉత్తర కొరియా గత యేడాది ప్రకటించింది. అయితే, ఉ కొరియా ప్రకటనపై దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ దేశాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి