అమెరికా డ్రోన్ దాడిలో ఏడుగురు పాక్ మిలిటెంట్ల హతం

పాకిస్థాన్‌ వాయువ్య గిరిజన ప్రాంతంలోని ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు వెంబడి అమెరికా డ్రోన్ జరిపిన దాడుల్లో హక్కానీ తీవ్రవాద గ్రూప్‌కు చెందిన ఏడుగురు మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా డ్రోన్ ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఉత్తర వజిరిస్థాన్ గిరిజన జిల్లా ముఖ్య పట్టణం మిరంషాహ్‌లోని ఒక కాంపౌండ్‌లో వాహనం పూర్తిగా ధ్వంసమయింది. దాడిలో ముగ్గురు తీవ్రవాదులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

హక్కానీ గ్రూప్ తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో‌ అమెరికా బలగాలకు అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఉంది. ఈ సంస్థను జలాలుద్ధీన్ హక్కానీ ఆయన కుమారుడు సిరాజుద్ధీన్‌లు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ వాషింగ్టన్ తయారు చేసిన ప్రపంచ తీవ్రవాదుల జాబితాలో ఉన్నారు. హక్కానీ గ్రూప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా బలగాలపై అనేక దాడులకు పాల్పడింది. 2009లో తూర్పు ప్రావిన్స్‌లోని అమెరికా స్థావరంపై జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు సీఐఏ సిబ్బంది చనిపోయారు.

వెబ్దునియా పై చదవండి