అమెరికా పౌరులారా మేల్కోండి...ఒబామా

అమెరికా పౌరులారా ఇకనైనా మేల్కోండి. ప్రతి పౌరుడుకూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. లేకుంటే భారతీయులు, చైనీయులు మనకన్నా ముందుండబోతున్నారు. ఎందుకంటే ఆ రెండు దేశాలుకూడా మన దేశాన్ని అధిగమించే స్థితికి చేరుకోబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా ఆ దేశ పౌరలుకు హితవు పలికారు.

శాస్త్ర, సాంకేతిక రంగాలలో మన దేశం వెనకబడిపోతోంది. మనం అన్ని దేశాలకన్నాకూడా గొప్పగా ఉన్నామని, అందరికన్నా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందున్నామని అనుకోవడం ఇకపై పొరబాటు పడినట్లేనని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో ఆ ఇరు దేశాలు మన దేశాన్ని అధిగమించే స్థితికి చేరుకుంటాయనడంలో సందేహం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

గత వంద సంవత్సరాలకుపైగా అమెరికా దేశం అతి పెద్ద ధనిక దేశంగా కొనియాడబడుతుండేది. దీనికంతటికి కారణం మన దేశ పౌరులు సుశిక్షితులు కావడమే. అందునా మన దేశంలోని ప్రతి పౌరుడుకూడా విద్యావంతుడు కావడమే. అలాగే దేశంలో హైస్కూల్ నుంచి పీహెచ్‌డీ, ఇంజనీయర్లు, శాస్త్రవేత్తలుకూడా మన దేశంలోనే అధికంగా ఉన్నారు. కాబట్టి మన దేశం ధనిక దేశంగా మారింది.

కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. మన దేశీయులు చదువు పట్ల అశ్రద్ధ కనబరుస్తున్నారు. మన దేశంలో అన్ని సౌకర్యాలున్న మంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలుండికూడా మన దేశ పౌరులు చదువులో వెనుకబడివున్నారు.

ఇక్కడ మంచి సౌకర్యవంతమైన విద్యాలయాలుండికూడా మన దేశ పౌరులు ప్రతిస్పర్థతోకూడిన పోటీ పరీక్షల్లో(కాంపిటీటివ్ పరీక్షల్లో) వెనుకపడిపోతున్నారు. దీనికంతటికీ కారణం మన అశ్రద్ధ మాత్రమేనని ఆయన అన్నారు. కాని దీనికి బదులుగా ప్రస్తుతం భారతీయులు వారితో సమానంగా చైనీయులు పోటీ పరీక్షలలో అతి వేగంగా ముందుకు దూసుకువస్తున్నారు. ఎందుకంటే వారిలో ఆకలి ఉంది. అంటే వారిలో తాము కూడా ఏదో సాధించాలనే పట్టుదల ఉంది. కాబట్టి వారు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేస్తున్నారు.

గత రెండు సంవత్సరాలుగా ఆయన అధ్యక్షపదవికి పోటీ చేసే క్రమంలోభాగంగా ప్రచారంలో భారత్, చైనా దేశాలను ఉదాహరణలుగా ఆ దేశ పౌరులకు సూచిస్తూ వచ్చారు. అందునా ప్రతి అమెరికా పౌరుడుకూడా జాగరూకతతో వ్యవహరించాలనికూడా ఆయన సూచిస్తూ వచ్చారు.

ఆ దేశ పౌరుల పిల్లలు తమకున్న సమయంలో ఎక్కువ సమయం పాఠశాలల్లో గడుపుతారని, అదే మన దేశ పిల్లలు ఎక్కువగా టీవీలు చూడటం, వీడియోగేమ్ ఆటలు ఆడటంలాంటివి చేస్తుంటారని ఆయన తెలిపారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశీయులు వెనకపడిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితినుంచి బయటపడేందుకు ముందుగా మన పిల్లలను మనం చక్కబెట్టాలి. ఇది ఒక విధమైన పరీక్షలాంటిది. దీనిని ప్రతి తల్లిదండ్రులుకూడా సానుకూలంగా స్పందించి తమ తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో కాస్త శ్రద్ధ కనబరిస్తే చాలా మంచిదని ఆయన సూచించారు.

అలాగే వారు చదువుతున్న ప్రతి తరగతి గురించి, వారి అధ్యాపకులతో సంప్రదించి మీ పిల్లల్లో ఏవైనా లోటుపాట్లుంటే అప్పటికప్పుడే సరిచేయడానికి ప్రయత్నించండని ఆయన ఆ దేశ పౌరులకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి