అవసరమైతే సైన్యాన్ని మొహరిస్తాం: డేవిడ్ కామెరాన్

శనివారం, 13 ఆగస్టు 2011 (10:39 IST)
దేశంలో మరోమారు ఘర్షణలు చెలరేగితే సైన్యాన్ని మొహరిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో లాకప్ డెత్‌ను నిరశిస్తూ చెలరేగిన అల్లర్లను అణిచి వేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన అంగీకరించారు.

ప్రస్తుత పరిస్థితులపై ఆయన స్పందిస్తూ ఇప్పటివరకు అల్లర్లను అణిచేందుకు బ్రిటన్‌లో సైన్యాన్ని ఎన్నడూ మోహరించలేదన్నారు. సంక్షోభ సమయాల్లో బ్లాక్‌బెర్రీ మెసెంజర్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలను అడ్డుకునే అవకాశం లోకపోలేదని తెలిపారు.

పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో ఉంచడం వల్ల వారు అల్లర్లను అదుపు చేయలేకపోయినట్లు కామెరాన్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి