అవి ఎయిర్ ఫ్రాన్స్ విమాన శకలాలు కాదు

బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శకలాలు లభ్యం కాలేదని బ్రెజిల్ అధికారులు తెలిపారు. బ్రెజిల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డైరెక్టర్ బ్రేగేడియర్ రామన్ కార్డోసో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విమానానికి సంబంధించిన ఎటువంటి వస్తువు కనుగొనలేదని చెప్పారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో ఇటీవల కనుగొన్న శకలాలు "సముద్ర చెత్త" అని చెప్పారు. సముద్రంలో గురువారం లభ్యమైన కార్గో పాలెట్, రెండు బోయకట్టెలు వాస్తవానికి ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందినవి కాదని, బహుశా ఇవి ఎదో నౌకకు సంబంధించినవి అయి ఉండవచ్చన్నారు. దొరికిన కార్గో పాలెట్ కలపతో తయారు చేసి ఉంది.

ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్‌బస్ ఏ330 విమానంలో కలపతో చేసిన పాలెట్‌లేవీ లేవని తెలిపారు. దీంతో అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం జాడ ఇప్పటికీ కనుగొనాల్సి ఉంది. ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2001 తరువాత ప్రపంచంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇదే.

వెబ్దునియా పై చదవండి