ఇరాక్‌లోని ఫాలుజా నగరంలో ఓ మసీదు వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందాగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఈ బాంబు పేలుడు జరిగింది.
ఇరాక్‌లోని ఫాలుజా నగరంలో సున్నీ మతస్థులకు చెందిన ఓ మసీదు బయట మంగళవారం సాయంత్రం నమాజు సమయంలో కారు బాంబు పేలడంతో 16 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.
ఫాలుజా నగరంలోని సున్నీ మతస్థులకు చెందిన ఓ మసీదులో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గట్టి బందోబస్తు నడుమ ఇటీవలే ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిస్థితి అదుపులో ఉందనుకుని అమెరికా సైన్యం ఇక్కడి నుంచి తొలగిన రెండవ రోజే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను కలచివేసిందని పోలీసులు వివరించారు.
ఇదిలావుండగా తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.