ఉ కొరియా జలాల్లోకి నౌకల ప్రవేశంపై నిషేధం

ఉత్తర కొరియా దేశ తీర్పుతీర ప్రాంత జలాల్లోకి నౌకలు, పడవల ప్రవేశంపై నిషేధం విధించినట్లు జపాన్ తీరప్రాంత రక్షణ దళం సోమవారం వెల్లడించింది. మత్స్యకారులు, బోట్ కెప్టెన్లను తూర్పుతీర జలాల్లోకి వెళ్లరాదని ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఈ ప్రాంతంలోనే ఉత్తర కొరియా మధ్యతరహా క్షిపణి పరీక్షకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఖండాకర క్షిపణి పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా పరీక్షించాలనుకుంటున్న ఖండాతర క్షిపణి అమెరికాను సైతం తాకగలదు.

ఇటీవల ఉత్తర కొరియా ఖండాతర క్షిపణి పరీక్షకు కూడా ప్రణాళికలు రచిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్షిపణి పరీక్ష జరగకపోవచ్చని దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది.

జపాన్ చేరగల సామర్థ్యం ఉన్న మధ్యతరహా క్షిపణిని మాత్రం ఉత్తర కొరియా పరీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కొరియా మే- 25న రెండోసారి అణు పరీక్ష నిర్వహించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటంతో పొరుగుదేశాలు కలవరపడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి