ఒబామా ఉపన్యాసం మోసపూరితమైంది: తాలిబన్

అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా గత వారం ముస్లిం దేశాలనుద్దేశించి ప్రసంగించిన ఉపన్యాసం మోసపూరితమైనదని, అతని ఉపన్యాసాలు విని ముస్లిం దేశాలు మోసపోకూడదని తాలిబన్లు సూచించారు.

కాహిరా విశ్వవిద్యాలయంలో ఒబామచేసిన ఉపన్యాసంలో ఏమంత గొప్పగా లేదని, అతని ఉపన్యాసం విని ముస్లిం సమాజం మోసపోకూడదని తాలిబన్లు ఇస్లామిస్ట్ ఇంటర్నెట్ ఫోరమ్‌కు పంపిన ఓ సందేశంలో పేర్కొన్నారు. అతను చేసే ప్రసంగాలద్వారా ముస్లిం దేశాలను మచ్చిక చేసుకోవడానికేనన్నది స్పష్టమౌతోందనికూడా ఆ సందేశంలో పేర్కొంది.

అమెరికా సైన్యం ఇరాక్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో ఉన్న అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. వారి మానవాధికారాలను కాలరాస్తోందని తాలిబన్ పంపిన సందేశంలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించడానికి ముస్లిందేశాలు ఎంతవరకు ముందుకు వస్తాయని తాలిబన్ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి