చిన్నారులతో అసభ్య ప్రవర్తన: భారతీయుడికి జైలుశిక్ష

శుక్రవారం, 5 ఆగస్టు 2011 (09:49 IST)
ఆస్ట్రేలియాలో ముగ్గురు చిన్నారుల వద్ద అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఒక భారతీయుని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన శివకుమార్ చిదంబరం అనే 40 యేళ్ళ వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో గత 1995 సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే, గత యేడాది ముగ్గురు చిన్నారుల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత చిన్నారుల తల్లదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై మెల్‌బోర్న్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా, శివకుమార్ మాత్రం జైలులోనే ఉంచారు.

ఈ నేపథ్యంలో విక్టోరియా కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు నిరూపితం కావడంతో శివకుమార్ చిదంబరంకు తొమ్మిది నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి