చైనాలోని ఓ టిన్ గనిలో గురువారం ప్రమాదం సభవించడంతో అక్కడికక్కడే 26 మంది మృతి చెందారు.
గనిలో ప్రమాదవశాత్తు రెండు లిఫ్ట్‌లు తెగిపోవడంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలైన తర్వాత మృతి చెందారు. ఇవి బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గని అధికారులు తెలిపారు.
మరో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఈ సంఘటనపై తాము విచారణ చేపట్టినట్లు పోలీసుల తెలిపారు.
ఇదిలావుండగా నిరుడు ఇదే గనిలో దాదాపు 3,200 మంది మృతి చెందినట్లు అధికారికంగా ఉన్నాయి. కాని ఇంతకంటే ఎక్కువేనని కార్మికులు చెపుతున్నారు. వీటిని వెలుగులోకి తీసుకురాకుండా కప్పిపుచ్చుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
కాగా ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన బొగ్గు గనులు చైనాలో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధను కనపరచడం లేదని పలువురు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న విద్యుత్‌కు ఉపయోగించే బొగ్గులో దాదాపు 70 శాతం బొగ్గను ఈ గనులనుంచే తీసుకుంటున్నట్లు సమాచారం.