చైనాతో ఎపుడైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధం: సాంగే

పొరుగు దేశం చైనాతో ఎపుడైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధంమని టిబెట్ ప్రభుత్వ కొత్త ప్రధానమంత్రి లోబ్‌సాంగ్ సాంగే తెలిపారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు రాజకీయ వారసుడైన సాంగే (43) సోమవారం ప్రవాస టిబెట్ కొత్త ప్రధాని (కలోన్ ట్రైపా)గా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం చైనాతో ఎక్కడైనా, ఎప్పుడైనా సరే శాంతియుతంగా చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వం నూతన ప్రధాన మంత్రి లోబ్‌సాంగ్ సాంగే ప్రకటించారు.

దలైలామా, ప్రవాస టిబెటన్ కమ్యూనిస్టు నేతలు, ఐదు వేల మంది టిబెటన్ల సమక్షంలో చీఫ్ జస్టిస్ కమిషనర్ గవాంగ్ పెల్‌గ్యాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. గత పదేళ్లుగా ఈ పదవిలో కొనసాగిన సామ్‌దాంగ్ రింపోచే (73) స్థానంలో సాంగే కలోన్ ట్రైపాగా ఎన్నికయ్యారు. దలైలామా మార్గంలోనే నడుస్తామని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి