భారతీయ విద్యార్థులపై దాడి చేసిన ఓ ఆస్ట్రేలియా యువకుడిపై ప్రతీకార దాడి జరిగినట్లు తెలుస్తోంది. భారతీయ విద్యార్థులపై జాతివివక్ష దాడులకు పాల్పిడినట్లు భావిస్తున్న 20 ఏళ్ల యువకుడిపై మెల్బోర్న్ పశ్చిమ శివారుల్లో దాడి జరిగింది. బాధితుడు జాత్యహంకారంతో ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులపై జాతివివక్షతో దాడులు జరగలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినప్పటికీ, అక్కడి భారతీయులు మాత్రం జరిగిన సంఘటనలను జాత్యహంకార దాడులగానే పేర్కొంటున్నారు. ఇప్పుడు తమపై జాతివివక్ష ప్రదర్శించినందుకు గుర్తు తెలియని ఇద్దరు నల్లజాతీయులు ఈ దాడి చేశారని పోలీసులు ది ఏజ్ అనే ఆస్ట్రేలియా పత్రికతో చెప్పారు.
బాధితుడు గతంలో మీరు నల్లజాతీయులు. మా దేశానికి చెందినవారు కాదు. తమ దేశాన్ని విడిచివెళ్లాలని జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ది ఏజ్ పేర్కొంది. పోలీసులు దాడికి పాల్పడిన 23, 29 ఏళ్ల వయసున్న యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా భారతీయ విద్యార్థులు తాజా దాడికి పాల్పడి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.