డ్రోన్ దాడులు ముమ్మరం: 21 మంది తీవ్రవాదుల హతం!

గురువారం, 11 ఆగస్టు 2011 (09:18 IST)
వాయువ్య పాకిస్థాన్‌లో అమెరికాకు చెందిన మానవ రహిత విమానాలు (డ్రోన్) జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కల్లోలిత ఉత్తర వజీరిస్థాన్ జిల్లా మిరాన్‌షా పట్టణంలోని ఓ భవనంపై అమెరికా సైన్యం డ్రోన్ క్షిపణి దాడులను చేసింది. ఈ దాడిలో మరణించిన వారిని హఖ్కాని ఉగ్రవాద సంస్థకు తీవ్రవాదులుగా గుర్తించారు.

ఇదిలావుండగా లిబియాలో నాటో దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది సామాన్యులు చనిపోయారని లిబియన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 33 మంది పిల్లలు, 32 మంది మహిళలు ఉన్నట్టు వివరించారు.

మజర్ ప్రాంతంలోని ఓ గ్రామంలోని నివాస గృహాలపై క్షిపణి దాడులు జరిపారని తెలిపారు. ఈ ఆరోపణలను నాటో దళాలు తిరస్కరించాయి. తమ దాడిలో మిలటరీ లక్ష్యాలను చేధించామని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి