తాలిబన్ తీవ్రవాదుల దాడులపై అమెరికా విచారణ!

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులపై పోరు సాగిస్తున్న పోరులో అమెరికాకు గత దశాబ్దకాలంలో ఎన్నడూ చవిచూడని ఎదురుదెబ్బ తగిలింది. నాటో దళాల హెలికాఫ్టన్‌ను తాలిబన్ తీవ్రవాదులు రాకెట్ దాడులు నిర్వహించి కూల్చి వేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో 32 అమెరికా సైనికులతో పాటు.. మొత్తం 40 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. దీనిపై అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఫోర్స్ విచారణ చేపట్టింది.

ఆప్ఘన్‌లో సాగిస్తున్న యుద్ధంలో ఒకేరోజులో పెద్ద మొత్తంలో 38 మంది మరణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్ దాడుల్లో హెలికాఫ్టర్‌పై దాడిలో మరణించిన సైనికుల్లో అబొట్టాబాద్‌లో ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన నావీ సీల్స్ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం.

దీనిపై ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఫోర్స్‌తో విచారణ చేపట్టినట్టు అమెరికా ప్రకటించింది. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి తమ వద్ద మాటలు లేవని అమెరికా సైనిక అధికారులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, నాటో హెలికాఫ్టర్‌ను తామే కూల్చివేసినట్టు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రకటించుకుంది.

వెబ్దునియా పై చదవండి