తాలిబాన్, అల్‌ఖైదాపై చర్యలు తీసుకోండి

అల్‌ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలపై యుద్ధానికి దిగాలని అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్ మిలటరీని కోరింది. తీవ్రవాదులపై అమీతుమీ తేల్చుకోవాలని, వారిని ఓడించాలని సలహా ఇచ్చింది. ఎటువంటి ముప్పు పొంచివున్నా దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని, అందుకు తాము పాకిస్థాన్ మిలిటరీకి మద్దతు ఇస్తామని అమెరికా రక్షణ కార్యాలయ ప్రతినిధి గెఫ్ మోరెల్ విలేకరులతో చెప్పారు.

పాకిస్థాన్ మిలిటరీ వారి దేశంలో దక్షిణ, ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతాలకు సైనిక చర్యను విస్తరించిందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మిలిటరీ వ్యూహాల జోలికి నేను వెళ్లాలనుకోవడం లేదు. వారు అక్కడికి వెళ్లాలి, ఇక్కడకు వెళ్లాలని కూడా సూచించాలనుకోవడం లేదు. స్వతంత్ర, సార్వభౌమ దేశంగా పాక్ దాని నిర్ణయాలు అదే తీసుకోగలదు.

స్వీయరక్షణ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఆ దేశ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందన్నారు. తాలిబాన్ లేదా దాని అనుబంధ తీవ్రవాద గ్రూపుల నుంచి పాకిస్థాన్‌కు ఎప్పుడు ఆపద వచ్చినా, ఆ దేశ ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంది. పొంచివున్న ముప్పుకు ప్రతిస్పందనగా కఠిన మిలిటరీ చర్యలు చేపట్టిందని మోరెల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి